Site icon Prime9

CM KCR Comments: కాంగ్రెస్ పాలనలో 58 ఏళ్లు గోస పడ్డాం.. సీఎం కేసీఆర్

CM KCR

CM KCR

 CM KCR Comments: కాంగ్రెస్ పాలనలో 58 ఏళ్లు గోస పడ్డామని వారి పాలనలో సాగునీరు ,తాగునీరు, కరెంట్ లేవని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం దుబ్బాకలోమ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ 1969 ఉద్యమంలో400 మందిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.

 33 పార్టీలను ఏకం చేసాను..( CM KCR Comments)

తెలంగాణ కోసం తాను దేశంలో 33 పార్టీలను ఏకం చేశానని కేసీఆర్ అన్నారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నాం. ఇప్పుడు అలా జరగకూడదు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేశాం.ఈసారి గెలిస్తే పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామని అన్నారు. ఓటు వేసేముందు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.పార్టీ, అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటేయాలి.ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు.మీ ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్.ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు.

అంతకుముందు వేములవాడ సభలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోంది.ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి రాజ్యం.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారు?రెంట్ 3 గంటలు చాలా? 24 గంటల కరెంట్ కావాలా? అంటూ ప్రశ్నించారు.ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటోందని ధరణి రద్దు చేస్తే రైతులకు డబ్బులు ఎలా వస్తాయని అడిగారు.ఈసారి గెలిస్తే పెన్షన్లను రూ.5 వేలకు,రైతు బంధును రూ.16 వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారు.

 

దుబ్బాకలో దుమ్ము రేపుతున్న కేసీఆర్ స్పీచ్..! | KCR Sensational Comments | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar