Site icon Prime9

Talliki Vandanam Scheme: మే నెలలో అందరి ఖాతాల్లో రూ.15,000.. సీఎం కీలక ప్రకటన

CM Chandrababu Announcement for Talliki Vandanam Scheme implemented by May: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే నెలలో తల్లికి వందన పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. అందరి ఖాతాల్లో రూ.15వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తామని చెప్పారు. అయితే స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇస్తామన్నారు.

 

అలాగే రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్‌ను తయారుచేస్తామన్నారు. ఇందు కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇక, పాలన అంతా వాట్సాప్ గవర్నెన్స్‌లో జరుగుతోందని వివరించారు. అధికారంలోకి రాగానే అమరావతి పనులు పట్టాలెక్కించామని చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్ విధానంలో అమరావతి నిర్మిస్తామని సీఎం వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar