Andhra Pradesh News: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతోపాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు.
వ్యవసాయ పంటల్లో 11,742 రెండు ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో పత్తి, 4,887ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర…ఉద్యాన పంటలలో ఏడు వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44కోట్లు చొప్పున మొత్తంగా రూ.59.39కోట్లు పంట నష్టపరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు అర్హులైనరైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా రైతు భరోసా కేంద్రాలలో (ఆర్బీకేలు) ఉంచారు.
ప్రస్తుతం 2022-23లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈనెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020-21 రబీ సీజన్కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5.68 లక్షల మందికి ర కిూ.115.33కోట్లు చొప్పున మొత్తంగా 8.2 రెండు లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు.