BJP Leader Arvind with his New Bride: హైదరాబాద్‌లో బీజేపీ నేత చేసిన నిర్వాహం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్వాన్ నియోజకవర్గ గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురాజాల అరవింద్ కుమార్.. ఓ నవ వధువుతో పరారయ్యాడు. కాగా, ఆయనకు ఇప్పటికే వివాహం కావడంతో పాటు పాప కూడా ఉంది.
వివరాల ప్రకారం.. బీజేపీ నేత అరవింద్ కుమార్(46)కు లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో ఉంటున్న ఓ యువతి గత కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. అయితే, ఇటీవల ఆ యువతికి అత్తాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి జరిగి సరిగ్గా 15 రోజులు అయిందని, 3 రోజుల క్రితం అరవింద్ ఆ వివాహితను కలవాలని కోరాడు.
దీంతో బండ్లగూడ సమీపంలోని ఓ దేవాలయం వద్ద అరవింద్, వివాహిత కలిశారు. అనంతరం అక్కడినుంచి ఇద్దరు పరారయ్యారు. విషయం తెలుసుకున్న వివాహిత కుటుంబసభ్యులు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు.అనంతరం కేసు నమోదు చేశారు. కాగా, లంగర్ హౌస్ దగ్గరలో అరవింద్ ఫొటోకు చెప్పుల దండ వేశారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.