Site icon Prime9

Mallareddy : బీజేపీ మమ్మల్నే కాదు కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేదు.. మంత్రి మల్లారెడ్డి

malla-reddy-not-attending-for-it-Enquiry

malla-reddy-not-attending-for-it-Enquiry

Telangana News: బీజేపీ మమ్మల్నే కాదు కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్ర పన్నుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ముందే ధైర్యం చెప్పారన్నారు. బీజేపీలో చేరితే ఐటీ దాడులుండవు, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి ఇతర పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఇంత పెద్ద ఐటీ దాడులు తానెప్పుడు చూడలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దాదాపు 400 మంది ఐటీ అధికారులు 65 బృందాలతో తన కుటుంబ సభ్యులు, విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, క్లర్కులను కూడా విచారించారన్నారు.

మధ్య తరగతి వారికి ఇంజినీరింగ్ విద్యాను అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు.నేనేమి అక్రమాలు, దౌర్జన్యాలు చేయలేదు. అన్ని వ్యాపారాలు న్యాయబద్దంగా చేస్తున్నాను. సోదాలు పేరుతో మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. రెండు రోజులుగా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రిన్సిపాల్స్ ఇళ్లలో సోదాలు చేసి, వారిని ఇబ్బంది పెట్టారు. డొనేషన్లు లేనప్పుడు రూ. 100 కోట్లు ఎలా వస్తాయి. సోదాల్లో రూ.28 లక్షల మాత్రమే దొరికే కోట్లు సీజ్ చేసినట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.

ఐటీ సోదాలు నాకు కొత్త కాదు. 1994, 2008లో ఇప్పుడు 2022 జరిగాయి. మెడికల్ కాలేజీలో సీట్లు కొనుగోలు అంతా ప్రొపర్ గా జరుగుతుంది. 150 సీట్లు ఉంటే అందులో 65 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా ఇస్తున్నాం. ఉచితంగా రోజు 1000 మందికి భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అందిస్తున్నాం. అంతా ఆన్ లైన్ లో జరుగుతుంది. ఇప్పటి వరకు 28 లక్షలు మాత్రమే ఐటీ అధికారులకు దొరికాయని మల్లారెడ్డి తెలిపారు.

Exit mobile version