Site icon Prime9

Balagam movie: స్దల వివాదంతో విడిపోయిన అన్నదమ్ములను కలిపిన ’బలగం‘ సినిమా

'Balagam'movie

'Balagam'movie

‘Balagam’movie: స్దల వివాదంతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా కలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల బలగం సినిమాను పెద్ద ఎత్తున గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన ఇద్దరు సోదరులు తమ విబేధాలను పక్కనపెట్టి కలిసిపోయారు.

ఇంటి స్థలం వివాదంతో ..(Balagam movie)

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన గుర్రం పోసులు, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు మూడేళ్ల కిందట తమ ఉమ్మడి ఆస్తి ఇంటి స్థలం పంచుకునే విషయంలో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. దీనితో వారిద్దరి కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిని మాట్లాడుకోవడం మానేసారు, స్దానిక పెద్దలు సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.ఈ నేపధ్యంలో ఆదివారం లక్ష్మణచాందలో స్థానిక గ్రామపెద్దలు ‘బలగం’ను ప్రదర్శించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరు అన్నదమ్ములు చాలమందితో కలిసి ఈ సినిమా చూసారు. సినిమా చూసిన తర్వాత, ఇద్దరూ మాట్లాడుకున్నారు. అంతేకాదు గ్రామ సర్పంచ్ ముత్యంరెడ్డి సమక్షంలో విభేదాలను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నారు.

సినిమా చూసి కలిసిపోయారు..

సినిమా చూసి పోసులు, రవి ఇద్దరూ తమ భూ వివాదాన్ని పరిష్కరించుకున్నారని ముత్యంరెడ్డి చెప్పారు. ఇద్దరు తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అతను చెప్పాడు. తాజాగా ఈ అన్నదమ్ముల కధ సోషల్ మీడియాలో వైరల్ అయింది.పలువురు దీనిని వాట్సాప్ ద్వారా కూడా పంచుకున్నారు.

బలగం సినిమా ఇంటర్నేషనల్ వేదికపై కూడా తన సత్తా ఏంటో చూపెట్టింది. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులను సినిమా రంగంలో ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అలాంటి కార్యక్రమంలో బలగం సినిమా రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో డైరెక్టర్ వేణు, ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ’ సెగ్మెంట్ లో ఆచార్య వేణు ఈ అవార్డులను దక్కించుకున్నారు. బలగం సినిమాకు అవార్డులు వచ్చిన విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కు అభినందనలు తెలిపింది.

తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల మధ్య బంధాలను ఈ సినిమాలో ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా వచ్చాయి. దర్శకుడిగా హాస్యనటుడు వేణు విజయం అందుకున్నారు. మార్చి 3న విడుదలై థియేటర్ లో విశేషంగా ఆకట్టుకున్నబలగం ఇపుడు ఓటీటీ వేదికగా కూడా అలరిస్తోంది. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌, హన్షిత ఈ సినిమాను నిర్మించారు.

Exit mobile version