Site icon Prime9

BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ ఈ నెల 24 కు వాయిదా

BRS MLC Kavitha

BRS MLC Kavitha

BRS MLC Kavitha:ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది .ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే .దీనిపై శుక్రవారం విచారణ జరగాల్సి వుంది . అయితే వాదనలకు మరింత సమయం కావాలని ఈడీ కోరడంతో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు . బెయిల్‌ అంశంపై ఆరోజు సమగ్ర విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కి ఢిల్లీ కోర్టు జడ్జ్ స్వర్ణకాంత శర్మ నోటీసులు జారీచేశారు .

ట్రయల్‌ కోర్టులో చుక్కెదురు..(BRS MLC Kavitha)

ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు తనపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపిస్తూ కవిత రౌస్‌ ఎవెన్యూ కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లో బెయిల్‌ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు నిరాకరించింది. కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కేసులో కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version
Skip to toolbar