Site icon Prime9

CM KCR:  ప్రగతి భవన్ లో ఆయుధ పూజ

Arms Pooja at Pragati Bhavan 

Arms Pooja at Pragati Bhavan 

Pragathi Bhavan: దేశ వ్యాప్తంగా దసరా పండుగను అంగరంగ వైభవంగా చేసుకొంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ,  దుష్ట శక్తుల పీడ నుండి విముక్తిని కలిగించాలని వేడుకొంటున్నారు. దసరా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తొలుత నల్ల పోచమ్మ దేవస్ధానంలో సీఎం కుటుంబ సమేతంగా పూజలు చేశారు. జమ్మి వృక్షానికి పూజ చేపట్టి జమ్మి ఆకును ఆహుతులకు పంచిపట్టారు. పరస్పర శుభాకాంక్షలు అందచేశారు. ఈ సందర్భంగా సీఎం వాహనానికి వేద పండితులు ఆయుధ పూజ చేయించారు. వాహనానికి సీఎం తన చేతుల మీదుగా దిష్టి తీశారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, సీఎంఓ పేషీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Viral News: “చెప్పులే” ఆ అమ్మవారికి మొక్కుబడులు..!

Exit mobile version