Site icon Prime9

Attack on Swiggy Boy: స్విగ్గీ బాయ్ పై దాడి

attack on swiggy boy

Swiggy : సమాచారం మేరకు, ఆర్డర్ బుకింగ్ వస్తువులను డెలివరీ తీసుకొనేందుకు కిరణ్ అనే స్విగ్గిబాయ్ భవానిపురంలోని ఓ హోటల్ లోపలకు వెళ్లుతుండగా ఈ ఘటన చోటుచేసుకొనింది. అదే సమయంలో హోటల్ నుండి బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరి కాలు కిరణ్ కు తగిలింది. ఏమని ప్రశ్నించినందుకు ఆ ముగ్గురు యువకులు స్విగ్గిబాయ్ పై దాడికి దిగారు. అనుకోని సంఘటనకు బిత్తరపోయిన కిరణ్ అక్కడ నుండి తప్పించుకొనేందుకు పరిగెత్తాడు. అతన్ని అడ్డుకొన్న ఆ ముగ్గరు యువకులు స్విగ్గిబాయ్ పై పిడి గుద్దులు గుద్దడాన్ని స్ధానికులు, అక్కడే వున్న మరికొందరు స్విగ్గిబాయ్ సిబ్బంది గమనించారు.

రక్షించే ప్రయత్నంలో వారిపై కూడా ఆ ముగ్గురు యువకులు వారిపై కూడా చేయిచేసుకొని కారులో అక్కడ నుండి పారిపోయారు. వారిని వెంబడించడంతో చివరకు సూరూర్ నగర్ పిఎస్ పరిధిలో వారిని పట్టుకొని స్ధానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో వారంతా మలక్ పేటకు చెందిన ఆకాష్, సైదాబాబ్, శివలుగా గుర్తించారు.

నిందులంతా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. అందులో ఆకాష్ అనే యువకుడు ఈ మద్యనే కెనడా నుండి హైదరాబాదుకు వచ్చిన్నట్లు పోలీసుల ప్రాధిమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన స్విగ్గిబాయ్ కిరణ ను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కేసు చైతన్యపురి పరిధిలో చోటుచేసుకోవడంతో నిందితులను సరూర్ నగర్ పోలీసులకు  అప్పచెప్పారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా వాస్తవాలను గుర్తించే పనిలో పడ్డారు. నిందితులతో పాటు ఓ యువతి కూడా కారులో ఉన్నట్లు స్థానికుల సమాచారంతో తెలుస్తుంది.

Exit mobile version