Site icon Prime9

Nara Lokesh: కుంభమేళలో మంత్రి నారా లోకేష్‌ దంపతులు – ఫోటో వైరల్‌

Nara Lokesh Visit Kumbh Mela: ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. కుటుంబ సమేతంగా కుంభమేళకు వెళ్లారు. భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా కుమారుడు, భార్యతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను షేర్‌ చేశారు. ఈ ఫోటోని షేర్‌ చేస్తూ “నిజమైన ఆశీర్వాదం లభించింది” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా ఈ మహా కుంభమేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ప్రతి రోజూ కోట్లలో ప్రజలు కుంభమేళకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కేవలం నిన్న (ఫిబ్రవరి 16) ఒక్క రోజే సాయంత్ర 6 గంటల వరకు 1.36 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో నిన్నటి వరకు మొత్తం 52.83 కోట్ల మంది కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపింది. ఇక ఈ కుంభమేళకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ ప్రయాగ్‌రాజ్‌ వచ్చారు. అలాగే భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ కుటుంబంతో వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక సినీ ప్రముఖులు సైతం కుంభమేళలకు తరలివస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar