AP BJP MLA quota MLC candidate Somu Veerraju: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. బీజేపీలో సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు నేడు కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాగా, ఏపీలో నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ గడువు ముగియనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు ఉండగా.. ఇందులో టీడీపీకి 3, జనసేన, బీజేపీకి చెరో ఒకటి చొప్పున సీట్లను సర్దుబాటు చేశారు. ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేయగా.. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. ఇందులో భాగంగానే తాజాగా, బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేశారు.
టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మల పేర్లను ఖరారు చేసింది. కాగా, వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది.