Site icon Prime9

Anjani Kumar : తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్

Anjani Kumar

Anjani Kumar

Anjani Kumar : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా మహేందర్ రెడ్డి స్థానంలో అంజనీకుమార్‌ని ప్రభుత్వం నియమించింది. రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్. సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ ని నియమించింది. ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్‌ కుమార్ జైన్, తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా జితేందర్ ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1990 బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ 2018 మార్చి 12న హైద్రాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు.చాలాకాలం కమీషనర్ గా పనిచేసిన అనంతరం ఆయనను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి రిటైర్ కానుండడంతో ముగ్గురు ఐపీఎస్ పేర్లను యూపీఎస్ సీకి ప్రభుత్వం పంపింది. అంజనీకుమార్ తో పాటు 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా ,1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్ షరాఫ్ లు పేర్లు ప్రధానంగా విన్పించాయి. ఉమేష్ షరాఫ్ రిటైర్మెంట్ కు ఆరు మాసాలే సమయం ఉంది. 1966 జనవరి 28న జన్మించిన అంజనీకుమార్ ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమాల్ కాలేజీ, పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీజీపీ మహేందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో రెండు వారాలు సెలవు పెట్టడంతో ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ వ్యవహరించారు.

Exit mobile version