Site icon Prime9

Love Marriage : నిరాడంబరంగా కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..

ysrcp mla rachumallu daughter love marriage in register office

ysrcp mla rachumallu daughter love marriage in register office

Love Marriage : ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువే జరుగుతున్నాయి. ప్రేమ కోసం దేశాలు దాటి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను గమనించవచ్చు. అయితే ప్రేమకి నో చెబుతూ పలు నేరాలకు దారి తీసిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి పెద్ద కుమార్తె పల్లవి ప్రేమ వివాహాన్ని నిరాడంబరంగా ఓ ఆలయంలో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో ఈ పెళ్లి వేడుక జరగగా.. ఆ తర్వాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎమ్మెల్యే పెద్ద కమార్తె పల్లవి చదువుకునే రోజుల్లో పవన్ కుమార్ అనే అతన్ని ప్రేమించారు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి వారి అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనకున్నారు. కుటుంబంలో తీవ్రంగా చర్చించిన తర్వాత పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి తెలిపారు. డబ్బు, కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా పెళ్లి చేయించినట్లుగా ఆయన వెల్లడించారు.

తాను నిరాడంబరంగా తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించాను అన్నారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం దగ్గరుండి వివాహం చేశానని.. పేదవాడైన పవన్‌ను కలిసి చదువుకున్న రోజుల్లో పల్లవి ఇష్టపడటంతో పెళ్లి చేసినట్లు చెప్పారు. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  వైసీపీ సీనియర్ నేతగా ఉంటూ రెండోసారి పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

Exit mobile version