Site icon Prime9

MLA Kapu Ramachandra Reddy: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి ఆత్మహత్య

Andhra Pradesh: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లో ఉన్న 101 నంబరు ఫ్లాటులో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మంజునాథరెడ్డిది అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీ నేత. పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని. విషయం తెలిసిన వెంటనే ఆయన విజయవాడ చేరుకున్నారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు. 101 నంబరు ఫ్లాటు బాధ్యతలను చూసే నరేంద్రరెడ్డి నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఫ్లాట్‌లోకి వెళ్లారని, ఆ తర్వాత కాసేపటికే అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

 

Exit mobile version