Site icon Prime9

World Space Week: శ్రీహరికోటలో ఘనంగా ముగిసిన అంతరిక్ష వారోత్సవాలు

World Space Week Festivals concluded grandly in Sriharikota

World Space Week Festivals concluded grandly in Sriharikota

Sriharikota: ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు నేటితో ముగిసాయి. అక్టోబర్ 4న ప్రారంభమైన వారోత్సవాలు నేటితో పూర్తి అయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జరిగిన ముగింపు వేడుకలలో ఐఐటి డైరెక్టర్ సత్యన్నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

గత ఏడు రోజులుగా జరుగుతున్న అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా శ్రీహరికోటతోపాటు ఒడిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్దులకు అంతరిక్ష పరిశోధనల పై అవగాహనలు కల్పించారు. మన దేశ శాస్త్రవేత్తలు రూపొందించిన ఉపగ్రహ ప్రయోజనాలతో ఎంతమేర అభివృద్ధి సాధించామో తెలియచేసేలా సదస్సులు చేపట్టి విద్యార్ధులకు సైన్సు పట్ల మక్కువ కలిగేలా చైతన్య పరిచారు.

ఈ సందర్భముగా ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అబ్దుల్ కలం వంటి శాస్త్రవేత్తలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అంతరిక్ష పరిశోధనలకు నేటి పాలకులు కూడా పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. విక్రమ్ సారాభాయ్ వంటి శాస్త్రవేత్తల కలలు సాకారానికి వారు బాటలు చూపిస్తున్నారన్నారు.

షార్ డైరెక్టర్ రాజరాజన్ మాట్లాడుతూ దేశంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి అంతరిక్ష పరిశోధనలే మూల కారణంగా పేర్కొన్నారు. సమాచార సాంకేతిక విప్లవాన్ని ఉపగ్రహాల ద్వారా తీసుకురావడం జరిగిందన్నారు. భవిషత్ తరాల కోసం ఇస్రో నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం వివిధ రకాల పోటీ పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దానికి ముందుగా లాంచ్ ప్యాడ్ వద్ద సౌండింగ్ రాకెట్ల ప్రయోగాన్ని విద్యార్ధులు నేరుగా వీక్షించేలా షార్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి: భారతదేశం చమురును ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తుంది.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి

Exit mobile version