Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో 14 కి చేరిన మృతుల సంఖ్య.. మృతులు పెరిగే ఛాన్స్ !

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504)..

  • Written By:
  • Publish Date - October 30, 2023 / 10:48 AM IST

Vizianagaram Train Accident : ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

కాగా ప్రమాద ధాటికి ఇప్పటికే ఓ రైలు ముందుభాగం, మరోరైలు వెనకభాగంలోని బోగీలు దెబ్బతిన్నాయి. ఓ రైలులోని ఇద్దరు లోకో పైలట్లు… మరో రైలు వెనకాల బోగీలోని గార్డు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలామంది ప్రయాణికులు రెండురైళ్ల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా…కొందరు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాద సమయంలో రెండు ప్యాసింజర్ రైళ్లలో దాదాపు 1400 మంది ప్రయాణికులు వున్నట్లు రైల్వే అధికారుల నుండి సమాచారం అందుతోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 14 కి చెరినట్లు తెలుస్తుంది. మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. వందలలో ప్రయాణికులకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 30 నుండి 40 వరకు వుండే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

రాత్రి సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం, కరెంట్ లేకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికులంతా ప్రాణ భయంతో కిందకు దిగి పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు గత రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వారికి స్థానిక ప్రజలు కూడా సహాయపడుతున్నారు.