Site icon Prime9

Venkayya Naidu : ఏపీ రాజధాని ఏర్పాటులో ప్రజాభిప్రాయమే ముఖ్యం – వెంకయ్య నాయుడు

Venkayya Naidu shocking comments on present politics

Venkayya Naidu shocking comments on present politics

Venkayya Naidu : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ 43వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కళాశాల ప్రాంగణంలో రెండున్నర కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యాక్టివ్‌ ఐడియా ల్యాబ్‌ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

కాలేజీలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేశారు.

అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా.. అందర్నీ ఆకట్టుకున్నాయి.

 

కాగా ఈ మేరకు విద్యార్ధులు వెంకయ్య నాయుడితో కాసేపు సరదాగా ముచ్చటించారు. అందులో భాగంగానే ఒక విద్యార్ధి ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడుని ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతిని చూడాలా ? వైజాగ్ ని చూడాలా ? మీరు క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ ఆయనను ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ  చేసిన తానూ రాజకీయాల్లో వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ రాజధాని గురించి తన అభిప్రాయం చెప్పానని గుర్తు చేశారు.

రాజధాని విషయంలో ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని ప్రభుత్వానికి వెంకయ్య నాయుడు సూచించారు. తాను రాజకీయాల్లో లేను కాబట్టి, రాజకీయాలపై వ్యాఖ్యానిస్తే పెద్ద సమస్యగా మారుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి తో కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. అలానే పట్టణాభివృద్ధి మంత్రిగా రాజధానికి నిధులు కూడా మంజూరు చేశానని వెంకయ్య నాయుడు తెలిపారు.

కాగా న్యూఢిల్లీలో జరిగిన సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం త్వరలో రాష్ట్ర రాజధాని అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో భాగంగా..’ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజధానిగా మారబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను కూడా త్వరలో విశాఖపట్నంకు షిఫ్ట్‌ అవుతానని’ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

మరోవైపు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతినే విభజన చట్టం ప్రకారం ఉందని పార్లమెంటులో వ్యాఖ్యానించారు. 2019లో జగన్‌ సర్కార్‌ మూడు రాజధానుల ఆలోచనను రూపొందించింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసనసభ రాజధానిగా ఉండబోతుందనే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఐతే రాజధాని తరలింపుపై 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన అమరావతి రైతుల నిరసనల దృష్ట్యా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిని సవాళ్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. చూడాలి మరి వైకాపా సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో అని..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version