Site icon Prime9

Farmers Padayatra: పాదయాత్రను అడ్డుకొంటామంటున్న వైకాపా

Vaikapa getting ready to block march

Vaikapa getting ready to block march

Amaravati: ఈ మేరకు ఉత్తరాంధ్రాలో అడుగు ఎలా పెడతారో చూస్తామంటూ వైకాపా నేతలు బాహాటంగానే రైతులకు సవాళ్లు ఇసురుతున్నారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రాన్ని స్వేచ్ఛను అడ్డుకొనేందకు అధికారం లేదంటూ కోర్టు అనేక పర్యాయాలు హెచ్చరించినా వైకాపా నేతల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. సరికద సవాళ్లు విసురుతూ రెచ్చగొడుతున్నారు. శాంతియుతంగా చేపడుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో వస్తున్న స్పందనకు అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టింస్తుండడంతో అడ్డుకొంటామంటూ పరోక్షంగా దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

తాజాగా మంత్రి అప్పల్రాజు రైతుల పోరాటం పై తన అక్కసును వెళ్లగక్కారు. ఉత్తరాంధ్ర పై ధ్వేషంతో ప్రాంతీయ ధ్వేషాలు రెచ్చగొట్టాలన్న ఉద్ధేశంతో విశాఖకు వస్తే చూస్తూ ఊరుకోమంటూ పాదయాత్ర రైతులకు సవాల్ విసిరారు. పాదయాత్ర పేరుతో ప్రతిపక్షాలు రైతుల ముసుగులో లక్షల్లో వచ్చినా అంతకు రెట్టింపుగా వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు మహా పాదయాత్రను వెనక్కి పంపుతామని పేర్కొన్నారు.

ఇందులో టీడీపీ వారు ఉన్న తమను ఏమీ చేయలేరని హెచ్చరించారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టు మెట్లు ఎక్కి సామాజిక అసమతుల్యత అంటూ వాదిస్తారా అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. కొన్ని గ్రామాల వారికే లబ్దిచేకూరేలా రాజధాని కట్టారంటూ విమర్శించారు. దానికి వెనుకబడిన వర్గాలు ఎందుకు అంగీకరించాలంటూ రాజధాని వ్యవహారంలో కులం ప్రస్తావని తీసుకొచ్చారు. ల్యాండ్ ప్యూలింగ్ స్కీం కింద రైతులకు 11వేల ఎకరాలు ఇవ్వాలి. అభివృద్ది కింద 30వేల ఎకరాలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చేతిలో మిగిలేది 10 వేల ఎకరాలైతే, ఇది ఏ రకంగా త్యాగమౌతుందో చెప్పాలంటూ ఆయనకు రైతులనుద్ధేశించి ప్రశ్నించారు.

ఇలా రోజుకొకరు మహా పాదయాత్రపై నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతున్నా పోలీసుల నుండి ఎలాంటి సూచనలు అధికార పార్టీ నేతలకు ఇవ్వడం లేదు. కార్యకర్తల దగ్గర నుండి మంత్రులు, ముఖ్య నేతల వరకు పాదయాత్రను అడ్డుకొంటామని బహిరంగంగా చెబుతున్నా కట్టడిలో పోలీసులు విఫలంగానే ఉన్నారు. ఇకనైనా శాంతియుతంగా పాద యాత్ర చేస్తున్న వారిని రెచ్చగొడుతున్న వారిని హెచ్చరించకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత ఎవరిదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version