Site icon Prime9

AP CM Chandrababu : ఉగ్రదాడిలో ఏపీవాసుల దుర్మరణం.. ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం

AP CM Chandrababu

AP CM Chandrababu

AP CM Chandrababu Condoles : పహల్గాంలో ఉగ్రదాడిలో ఏపీకి చెందిన చెందిన ఇద్దరు మృతిచెందారు. ఒకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కాగా, మరొకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ ఉన్నారు. వారి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు శక్తిని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడులను ఖండించారు.

 

పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్ చంద్రమౌళి మృతిచెందగా, ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడ్డారు. పారిపోతున్న క్రమంలో వెటాడి కాల్పి చంపారు. చంపొద్దని వేడుకున్నా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిగిన 3 గంటల అనంతరం చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందని మధుసూదన్ మృతిచెందాడు. మధుసూదన్ కుటుంబం ఇటీవల బెంగళూరులో స్థిరపడింది. ఈ క్రమంలోనే ఆయన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లగా, ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

 

రాత్రి వైజాగ్‌కు సీఎం..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాత్రి 10 గంటలకు విశాఖకు వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు చేరుకోనుంది.

 

 

Exit mobile version
Skip to toolbar