Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అయితే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల సర్వదర్శనానికే ప్రాధాన్యం కల్పించేలా ఆ తొమ్మిది రోజులకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను మాత్రం రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి 18వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేసే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి, ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో వేచివున్నారు.
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా, మరోవైపు, వసతి గదులన్నీ ఫుల్ అయ్యాయి. నిన్న 72 వేల 8 వందల 51 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 34 వేల 4 వందల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 73 లక్షలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.