Tirupathi: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలోని ధ్వజ స్తంభం దగ్గర వందల ఏళ్ల నాటి పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆకస్మాత్తుగా చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆలయ అధికారులు, పోలీసులు హుటాహుటన సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్టు కూలిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప(70) గా గుర్తించారు. గుర్రప్ప గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా సేవలందించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కడపలో నివాసం ఉంటున్నారు. కాగా, తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు గుర్పప్ప వచ్చారు. ఈ క్రమంలో దర్శనం కోసం గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.
భయంతో కేకలు వేస్తూ పరుగులు(Tirupathi)
వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు కూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఊహించని ప్రమాదం కావడంతో ప్రాణనష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినపుడు దర్శనానికి బ్రేక్ సమయం కావడంతో భక్తులు బయటే వేచి చూశారు. సమయం ముగిసిన వెంటనే ఆలయంలోని వెళ్లి స్వామిని దర్శించుకోవాలని భావించారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా భారీగా గాలులు వీయడం.. ధాటిరి ఆలయం ఆవరణలో మర్రి చెట్టు కూలిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. బ్రేక్ సమయంలో చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్న భక్తులు ఈ ఘటనలో గాయపడ్డారు. చెట్టు కూలిపోవడంతో దాని పరిసరాల్లో ఉన్న భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు ఘటనలో గాయపడిన వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.