Mithun Reddy High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో సిట్ విచారణను లాయర్ల సమక్షంలో చేయాలని ఎంపీ పిటిషన్ వేశారు. తనను సిట్ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోను రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో కోర్టును కోరారు. మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మిథున్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసాన్ని ఆశ్రయించగా, ఆయనకు ఊరట లభించింది.
మిథున్‌రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు..
కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎంపీ మిథున్‌రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. కేసులో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేత రాజ్ కసిరెడ్డికి నాలుగుసార్లు నోటీసులు ఇచ్చిన ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డికి శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా, ఆయన గురువారం విచారణకు హాజరవుతానని తెలిపారు. ఏది ఏమైనప్పటికి గత వైసీపీ ప్రభుత్వ నేతలను లిక్కర్ స్కాం కేసు వెంటాడుతుందనే చెప్పుకొవాలి.