Amaravati Farmers Maha Padayatra: రెండో రోజు 18కి.మీ మేర సాగనున్న పాదయాత్ర

అమరావతి నుండి అరసవల్లి వరకు చేపట్టనున్న అమరావతి రైతులు మహా పాదయాత్ర రెండో రోజుకు చేరుకొనింది

Amaravati: అమరావతి నుండి అరసవల్లి వరకు చేపట్టనున్న అమరావతి రైతులు మహా పాదయాత్ర రెండో రోజుకు చేరుకొనింది. నేడు ఉదయం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన పాదయాత్రలో పిసిసి అధ్యక్షులు శైలజానాధ్, భాజాపా నేత కన్నా లక్ష్మీ నారాయణ, సీపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. తమ సంఘీభావాన్ని నిర్వాహాకులకు తెలిపారు.

మరోవైపు మహా పాదయాత్ర పై విషం కక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో పాల్గొన్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. 600 మందితో తాము పాదయాత్ర చేపట్టామని వారందరి వివరాలు పోలీసులు తెలిపామన్న నిర్వాహకులు స్వచ్ఛందంగా పాదయాత్రకు ప్రజలు మద్దతివ్వచ్చని కోర్టు సూచించడాన్ని కూడా ఈ సందర్భంగా పోలీసులకు గుర్తు చేశారు. రెండో రోజు పాదయాత్ర ద్వారకానగర్, రాజీవ్ సెంటర్, పెద వడ్లపూడి, రేవేంద్రపాడు మీదుగా దుగ్గిరాల చేరుకోనుంది.

తొలి దఫా జరిగిన పాదయాత్రలో ఏర్పడిన అనుభవాలను పోలీసులు మరవడంతో తాజాగా గుర్తింపు కార్డులు పేరుతో మరో జగన్నాటకానికి తెరలేపారంటూ స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.