AP Assembly : విద్యకు కూటమి సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి చెప్పారు. 2016 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. బిల్లులో లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామని స్పష్టం చేశారు. ఎన్సీసీకి సంబంధించిన ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించినట్లు తెలిపారు. యువగళం పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, చేనేత కార్మికులకు ఉచిత కరెంట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
బిట్స్ ప్రాంగణాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయిస్తూ సోమవారం కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే చేయాలని దృష్టి సారించామన్నారు.పాఠశాలల్లో ఎన్‌సీసీతోపాటు క్రీడా మైదానం, ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులపై సభ్యుల ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు.
ఎన్‌సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామని, త్వరలో ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర అంశాలపై మానిటరింగ్ జరుగుతోందని బదులిచ్చారు. చేనేత కార్మికుల ఉచిత కరెంట్‌కు కేబినెట్ ఆమోదం సంతోషాన్నిచ్చింది. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. యువగళం పాదయాత్రలో చేనేతలో కష్టాలు ప్రత్యక్షంగా చూసినట్లు మంత్రి పేర్కొన్నారు.