Barbers Protest: క్షురకలు నిరసనలు.. బారులు తీరిన శ్రీవారి భక్తులు

విజిలెన్స్ అధికారుల తీరును నిరసిస్తూ తిరుమల క్షురకులు నిరసనలకు దిగారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందకు భక్తులు బారులు తీరారు.

Tirumala: విజిలెన్స్ అధికారుల తీరును నిరసిస్తూ తిరుమల క్షురకులు నిరసనలకు దిగారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందకు భక్తులు బారులు తీరారు.

సమాచారం మేరకు, తిరుమలలో భక్తుల తలనీలాలు తీసేందకు శాస్వత ఉద్యోగులతో పాటు ఒప్పంద ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది క్షురకులు భక్తుల నుండి నగదు వసూలు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు దృష్టికి వచ్చింది. నిఘా భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో పలు కల్యాణ కట్టల్లోని క్షురకులను తనిఖీలు చేశారు. అయితే ఆ క్రమంలో దుస్తులు విప్పి తనిఖీలు చేయడాన్ని ఖండిస్తూ క్షురకులు నిరసనలకు దిగారు.

దీంతో తలనీలాలు సమర్పించేందకు వచ్చిన భక్తులకు బారులు తీరారు. 1100 మంది క్షురకుల్లో 750 మంది ఒప్పంద పద్దతిలో విదులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారుల తీరును నిరసిస్తూ వారు విధులను బహిష్కరించడంతో భక్తుల వసతి సముదాయం 1,2,3, నందకం, కౌస్తుభం, ఎస్వీ వసతి గృహాల్లో తలనీలాల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. భక్తులు వేల సంఖ్యకు చేరుకోవడంతో అధికారులు తలలు పట్టుకొంటున్నారు.

ఇది కూడా చదవండి: Janasena Party: మంత్రులూ.. మీ పాలనాభివృద్ధిని వివరించరూ! సోషల్ మీడియా వేదికగా జనసేన సూటి ప్రశ్నలు