SI Results: ఆంధ్రప్రదేశ్ లో ఎస్సై పరీక్షలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రిజల్ట్ ను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19 న ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు మొత్తం 1,51,288 అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 57,923 మంది అభ్యర్థులు ప్రిలిమనరీలో అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాల
కోసం https://slprb.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోగలరు.
అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్టు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.
అర్ఘల సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్ లౌడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
రెండు పేపర్లలో అర్హత సాధించిన వారి ఫిజికల్ పరీక్షలు జరుగుతాయని బోర్డు వెల్లడించింది.
అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ లకు 30 శాతం మార్కులుగా నిర్ణయించారు.
అభ్యర్థికి ఒక పేపర్‌లో కూడా క్వాలిఫయింగ్ మార్కులు రాకపోతే అర్హత సాధించలేరు.
క్వాలిఫై కోసం రెండు పేపర్ల మార్కులను కలిపి లెక్కించరు. అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ టెస్ట్ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 20న విడుదల చేసినట్టు బోర్డు తెలిపింది.
ఫస్ట్ పేపర్ ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదన్నారు. అయితే రెండో పేపర్‌లో ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయని..
ఫైనల్ ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో ఉంచామని వివరించింది.
స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్ మార్చి 4 వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తదుపరి ప్రక్రియ, పీఎంటీ, పీఈటీ కోసం వెబ్‌సైట్ సందర్శించవచ్చని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ మనీష్ కుమార్ సిన్హా సూచించారు.