AP Student: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్ధి మృతి చెందాడు. గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి ఈ కాల్పుల్లో మరణించాడు. యువకుడి మరణంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దుండగుల కాల్పులు..
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్ధి మృతి చెందాడు. గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి ఈ కాల్పుల్లో మరణించాడు. యువకుడి మరణంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్.. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అక్కడే ఓ షెల్ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో..
ఇద్దరు దుండగులు నగదు కోసం కాల్పులు జరిపి.. డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో సాయిష్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే.. సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిష్ మరణించాడు. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు.
పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండెళ్ల క్రితం.. యూస్ వెళ్లిన సాయి
ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. ఇలాంటి సమయంలో.. సాయి మృతి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.