Site icon Prime9

Road Accident : గుంటుపల్లిలో స్కూల్ ఆటో బోల్తా.. ఓ విద్యార్థిని మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

22 members injured in Road Accident at chittor district

22 members injured in Road Accident at chittor district

Road Accident : మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో స్కూల్ ఆటో బోల్తాపడగా.. ఓ విద్యార్థిని మృతి చెందింది. అదే విధంగా 14 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన నిన్న(మంగళవారం) సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం అందుతుంది.

వివరాల్లోకి వెళితే.. స్థానిక డాన్ బాస్కో స్కూల్ కి బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు చెందిన ఆటోల్లో వస్తుంటారు. ఈ క్రమంలోనే స్కూల్ విడిచిపెట్టాక విద్యార్థులు ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. అయితే  విజయవాడ భవానిపురం వైపు వెళుతున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో విద్యార్ధులు నిండుగా ఉండగా.. దీంతో ఒకరిపై ఒకరు పడిపోయి ఊపిరాడక ఐదో తరగతి బాలిక నవ్య శ్రీ అక్కడికక్కడే మృతి చెందింది.

మరో 14 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి ఆటోలోంచి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన వారిని గొల్లపూడిలోని హాస్పటల్ కు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్ధులకు ఊహించని ప్రమాదం జరగడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Exit mobile version