Police Suspension : కుల, మతాలకు అతీతంగా దైవ సన్నిధిలో ఎవరైనా సరే.. భయ భక్తులతో ఉంటుంటారు. అయితే అటువంటి చోటే ప్రజలకు రక్షణ కల్పిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారే నిబంధనలను అతీతంగా చేస్తే.. అతిక్రమించి పేకాట ఆడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పవిత్రమైన శ్రీశైలం ఆలయ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవిత్రమైన శ్రీశైలం పుణ్య క్షేత్రం పరిధిలో పోలీసులు పేకాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన విధుల్లో ఉన్న పోలీసులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటంపై భక్తులు మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక కానిస్టేబుల్, ఐదుగురు హోం గార్డులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.