Sullurpet: ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకొన్నారు. అశువులు బాసిన పోలీసులను స్మరించుకొంటూ చేపట్టిన కార్యక్రమాల్లో నేతలు, ప్రజలు, విద్యార్ధులు స్వచ్ఛందంగా పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. పురవీధుల్లో తిరుగుతూ పోలీసు సేవలను గుర్తుచేశారు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పలువరు మాట్లాడుతూ నేడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం పోలీసుగా పేర్కొన్నారు. కుటుంబాలను సైతం త్యాగం చూస్తూ ప్రజాసేవలో ఉంటున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. సూళ్లూరుపేటలో చేపట్టిన అమరవీరుల వారోత్సవాల్లో స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, పోలీసులు, విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు.
1959లో చైనాతో మన సరిహద్దులను కాపాడుతూ తమ ప్రాణాలను అర్పించిన పది మంది పోలీసుల త్యాగాలను స్మరించుకొంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలోని అన్ని పోలీసు దళాలలో అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారు. లడఖ్‌లోని అక్సాయ్ చిన్‌లోని హాట్ స్ప్రింగ్ ఇండో-టిబెట్ సరిహద్దులో సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉంది. భారత దేశ పోలీసులచే పహారా నిర్వహించబడుతుంది. చైనీస్ ఆర్మీ కార్యకలాపాల నేపథ్యంలో, ఇండో-టిబెట్ బోర్డర్ ఫోర్స్‌తో కూడిన సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో పాటు ఇతర బలగాలను ఇండో-టిబెట్ సరిహద్దులో కాపలాగా ఉంచారు. దేశ ప్రజల శాంతియుత జీవనానికి ప్రతి పోలీసు ఎంతో ముఖ్యమని గుర్తించాల్సి ఉంది. వారి సేవలను పౌరులందరూ గౌరవించాలి.
ఇది కూడా చదవండి: YS Sharmila: వైఎస్ వివేక హత్య మిస్టరీ వీడాలి.. నిందితులకు శిక్ష పడాలి.. షర్మిల