Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పాలు అవతారం ఎత్తారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించిన ఉషశ్రీ చరణ్ 6వ తరగతి విద్యార్ధులకు పాఠాలు బోధించారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మంత్రి ఉషశ్రీ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. పాఠశాలలోని సౌకర్యాలు, సమస్యలను పరిశీలించారు.
కొద్దిరోజులకిందట తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు, అనంతరం పలు ప్రశ్నలు వేసి పిల్లల నుంచి సమాధానాలు కూడా రాబట్టారు. సీఎం జగన్ తమ పార్టీ నేతలకు గ్రామాలను సందర్శించాలని, ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగితెలుసుకోవాలని తరచూ చెబుతున్నారు. దీనిని కొంతమంది పాటిస్తున్నారు.
నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు. pic.twitter.com/N9ikTr7U3v
— K.V.Ushashricharan (@ushashricharan) November 5, 2022