Minister Sidiri Appala Raju : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
చంద్రబాబు పిచ్చి వలనే ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారని రాష్ట్ర మత్స్యశాఖ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పుష్కరాలలో ఎలాగైతే చనిపోయారో ఇప్పుడు అలానే జరిగిందని తెలిపారు. పుష్కరాలలో 36 మంది చనిపోతే… చంద్రబాబు ఏమన్నాడో తెలుసా అని ప్రశ్నించారు. కుంభమేళాలో చచ్చిపోలేదా..? యాక్సిడెంట్స్ లో చచ్చిపోలేదా..? అని చంద్రబాబు ఎద్దేవా చేశాడని మంత్రి సీదిరి గుర్తు చేశారు. నిన్న జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది చనిపోవడానికి చంద్రబాబే కారణమని నిందించారు. చంద్రబాబు తనవాళ్లతో ఎనిమిది మందిని తొక్కించి చంపేచారని ఆరోపించారు.
కేవలం చంద్రబాబు గొప్పను చూపించడం కోసం… సభకు జనాలను తీసుకువస్తున్నారని… టీవిల్లో చూపించడం కోసం చంద్రబాబు ప్రాకులాడారని అన్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చేప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కందుకూరు ఘటనను పబ్లిసిటీ కోసమే ఉపయోగించుకున్నారని, తెదేపా నిర్లక్ష్యం వల్లే ఈ దుర్గతన జరిగిందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.