Minister Botsa Satyanarayana: వైకాపా నేతల మాటలపై బొత్స సీరియస్

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దూకుడును మరింత పెంచింది. విశాఖపట్నంలో వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యన్నారాయణ వైకాపా నేతలపై సీరియస్ అయ్యారు.

Amaravati: మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దూకుడును మరింత పెంచింది. విశాఖపట్నంలో వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యన్నారాయణ వైకాపా నేతలపై సీరియస్ అయ్యారు. అమరావతి రైతుల పాదయాత్రను తరమికొట్టాలంటూ కొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ్యద్దని వైకాపాకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భధ్రతల విఘాతం కలిగేలా మాట్లాడొద్దని వైకాపా క్యాడర్ కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎదుటవారి మనోభావాలు దెబ్బతీసే హక్కు మరొకరి లేదని స్పష్టం చేశారు.

మంత్రి రోజా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసి తీరుతామని స్పష్టం చేశారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న మంత్రి అక్కడ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధే నేటి సీఎం ప్రయత్నంగా చెప్పుకొచ్చారు. రైతుల పేరుతో దొంగ పాదయాత్రల సూత్రధారి మాజీ సీఎం చంద్రబాబేనని ఆమె ఆరోపించారు. రౌండ్ టేబుల్ సమావేశం పై తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేసారు. ప్రతిపక్షాలు లేకుండా వైకాపాకు చెందిన వారితో రౌండ్ టేబుల్ ఎందుకని హేళన చేసారు.