Site icon Prime9

MRO Kantara Getup: ’కాంతారా‘ గెటప్ లో మండల రెవెన్యూ అధికారి

Kantara

Kantara

Vizianagaram: ఆయన మండల రెవెన్యూ అధికారి. అది అతని వృత్తి. కానీ అతని అభిరుచి కళలు. ఆయన ఎవరో కాదు కొత్తవలస తహశీల్దార్ ప్రసాదరావు. తాజాగా ఆయన ’కాంతారా‘ గెటప్‌తో గుంటూరు జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించారు.

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఆరో ఎడిషన్ జరుగుతోంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తహశీల్దార్ ప్రసాదరావు కాంతారా తరహా గెటప్‌ వేసి అందరినీ అబ్బురపరిచారు. అంతే కాదు, ప్రసాదరావు ఈ చిత్రంలోని ఏకపాత్రాభినయంతో సభను ఆకట్టుకున్నారు. దీనితో  గుంటూరు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రసాదరావును అభినందించి అతనితో సెల్ఫీ దిగారు. ఇతర రెవెన్యూ అధికారులు కూడా ప్రసాదరావు మరియు అతని నటనపై ప్రశంసలు కురిపించారు.

Exit mobile version