Site icon Prime9

Kethu Viswanatha Reddy: ప్రముఖ కథా రచయిత, కవి కేతు విశ్వనాథ రెడ్డి మృతి

kethu

kethu

Kethu Viswanatha Reddy: ప్రముఖ కథా రచయిత.. కవి కేతు విశ్వనాథరెడ్డి సోమవారం ఉదయం కన్నుముశారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి ఆయన విశేష కృషి చేశారు.

గుండెపోటుతో మృతి..

ప్రముఖ కథా రచయిత.. కవి కేతు విశ్వనాథరెడ్డి సోమవారం ఉదయం కన్నుముశారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి ఆయన విశేష కృషి చేశారు.

కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమ కథకు చిరునామాగా నిలిచారు. గుండెపోటు వచ్చిన ఆయన్ని ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు వక్తలు, రచయితలు సంతాపం వ్యక్తం చేశారు.

సంతాపం తెలిపిన సీఎం జగన్

కేతు విశ్వనాథరెడ్డి మరణం పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్‌ గుర్తుచేశారు.

కేతు విశ్వ‌నాథ‌రెడ్డి వైఎస్సార్ జిల్లా ఎర్ర‌గుంట్ల మండ‌లం రంగ‌శాయిపురం. సాహితీ, విద్యావేత్త‌గా రాయ‌ల‌సీమ మాండ‌లికానికి గొప్ప పేరు తీసుకొచ్చారు.

జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు, కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే న‌వ‌ల‌లు వెలువ‌రించారు. రాయ‌ల‌సీమ మాండ‌లికంలో సాగిన ఈయ‌న ర‌చ‌న‌లు మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లాయి. ఈయన రాసిన అనేక‌ కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

Exit mobile version