Nagababu First Public Meeting Held At Punganur: మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల జనంలోకి జనం అనే కార్యక్రమానికి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఆయన సాధారణ జనంతో మమేకమైన జనసేన పార్టీ ప్రజల్లోకి ఎంత చేరువైంది, జనసేన పట్ల వారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నారు.
నాగబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేటి (ఫిబ్రవరి 2 ) నుంచి శ్రీకారం చూట్టారు. తొలి సభను పుంగనూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఇవాళ పుంగనూరులో నిర్వహిస్తున్న ‘జనంలోకి జనసేన’ తొలిసభకు కాసేపట్లో నాగబాబు చేరుకోనుననారు. ఈ క్రమంలో ఈ సభకు జనసేన నేతలు భారీగా తరలివస్తున్నారు. ఆరీ ఎత్తున్న నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు స్థానిక జనసేన నేతలు భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఈ ఎనిమిది నెలల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. కూటమి పాలనపై జనాలు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు తీర్చింది? కూటమి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.