Site icon Prime9

Ap Budget 2023-24: మంత్రి బుగ్గన బడ్జెట్.. 2023-24 వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా..?

Ap Budget 2023-24

Ap Budget 2023-24

Ap Budget 2023-24: ఆంధ్రప్రదేశ్ బడ్జెజ్ సమావేశాల్లో నేడు కీలకం ఘట్టం. ఈ ఏడాదికి 2023-24గాను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

వార్షిక బడ్జెట్(Ap Budget 2023-24) ఎంతో తెలుసా..?

ఉదయం 7 గంటలకు ఆర్థిక మంత్రి ఛాంబర్ లో బడ్జెట్ కాపీలకు ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు బుగ్గన. దానికి కేబినేట్‌ ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఏడాదికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి. మొత్తం రూ. 2.79 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం.

ఇకపోతే వార్షిక బడ్జెట్ తర్వాత వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కాకాణి ప్రవేశపెట్టనున్నారు అలాగే మండలిలో మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి సీదిరి అప్పలరాజు, సాధారణ బడ్జెట్ ను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టనున్నారు.

రాబోయే ఎన్నికల దృష్ట్యా తాజా బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
ఈ క్రమంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని, విద్య, వైద్యం, సాగునీటి రంగాల‌కు అధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే గతేడాది కూడా వైసీపీ ప్రభుత్వం వ్యవసాయం సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version