Site icon Prime9

AP Deputy CM  : కుంటల చుట్టూ మొక్కలు పెంచండి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

AP Deputy CM

AP Deputy CM   : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామంలో ఏపీ ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు.

 

 

నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాలో రూ.75కోట్లతో 117 కిలో మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా 98శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. నీటి నిల్వ కోసం వర్షాలు పడగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తామన్నారు.

 

 

పల్లె పండుగ విజయానికి బలమైన నాయకుడు సీఎం ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 100మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని తెలిపారు. కుంటల చుట్టూ అరటి, నిమ్మ, దానిమ్మ వంటి మొక్కలు పెంచితే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

 

 

ఉపాధి హామీ పథకం కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు రూ.9.597 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘గెలుపులోనే మనుషులను లెక్కించడం.. కష్ట సమయంలోనూ ఎలా ఉన్నారనే చూస్తా’ అని పవన్ తెలిపారు. కష్ట సమయంలో బలంగా నిలబడి ఈ విజయం సాధించామన్నారు. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, యువత, మహిళలకు దక్కుతుందని పవన్ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar