Site icon Prime9

Trending News : ఒంగోలులో దారుణం.. గిరిజన యువకుడిని చితకబాది.. నోట్లో మూత్రం పోసి.. మర్మాంగాన్ని ???

group of people from ap attacked on person and urinate in his mouth and videos got viral

group of people from ap attacked on person and urinate in his mouth and videos got viral

Trending News : మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ  తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు లోకి వేచిన ఈ ఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారడంతో బయటికి వచ్చినట్లు తెలుస్తుంది.

ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు ఆపై అతడిని చావబాది.. అతని నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చితకబాదారు. అంతటితో ఆగకుండా మూత్రం పోస్తున్న వ్యక్తి మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలంటూ కొట్టారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినిపించుకోలేదు. బూతులు తిడుతూ కసిగా కొట్టారు. చివరికి ఈ విషయాన్ని అంతా సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. సుమారు నెల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఆ ఘటన గురించి వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు మోటా నవీన్‌ గిరిజన యువకుడు. ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి). వీరిద్దరూ చిన్నప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరిపై సుమారు 50కి పైగా గృహ దొంగతనాల కేసులున్నాయి. నవీన్‌ పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష అనుభవించాడు. అంజి కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం అంజి.. నవీన్‌ను మద్యం తాగుదామంటూ ఒంగోలులోని కిమ్స్‌ వైద్యశాల వెనుక వైపునకు పిలిచాడు. నవీన్‌ అక్కడికి వెళ్లేసరికి అక్కడ అంజితోపాటు ఒంగోలులోని ఇస్లాంపేట, గోపాల్‌నగర్‌, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన మొత్తం 9 మంది యువకులు ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు.

ఆపై అంజి, నవీన్ మధ్య పాత గొడవ మరోమారు రేగింది. దీంతో అందరూ కలిసి నవీన్‌పై మూకుమ్మడి దాడిచేశారు. తనను వదిలెయ్యాలని బతిమాలినా వినిపించుకోలేదు. రక్తమోడేలా కొట్టారు. ఆపై నవీన్ నోట్లో మూత్రం పోస్తూ మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టుకోమని బలవంతం చేశారు. కొందరు ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియోలను నిందితులలో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటికి వచ్చింది.

కానీ ఈ ఘటనలో పోలీసుల వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల క్రితమే ఈ వ్యవహారంపై బాధితుడు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేవలం దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. నిందితుల విచారణ, అరెస్టుకు సైతం ప్రయత్నించలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఘటనతో సంబంధం ఉన్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

 

Exit mobile version