Government Employee Suspension: భర్త కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి ని సస్పెండ్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది .ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య దేవిని సస్పెండ్ చేశారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో డాక్టర్ లావణ్య దేవి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగంలో వుంది ఓకే అభ్యర్థి తరువున ప్రచారం చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.. .
వివరణ ఇచ్చినా సస్పెన్షన్.. (Government Employee Suspension)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గాజువాక నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య లావణ్య దేవి ఈ నెల 4న గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయ. దీనికి సంబంధించి లావణ్య దేవి కి రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.. ఈ నోటీసుపై ఆమె సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీవాణి అనే మహిళను వ్యక్తిగత పనిమీద కలిసేందుకు వెళ్లానని , తాను స్వతహాగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని ఆమె వివరణ ఇచ్చారు .అయినప్పటికీ జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు లావణ్య దేవిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఈ సస్పెన్షన్ సమయంలో ఆమె కచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలని.. అంతేకాదు వర్శిటీ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వకుండా జిల్లా కేంద్రం దాడి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు