Prime9

4 Killed in Accident Rajahmundry: రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరొకరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. కాగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar