Site icon Prime9

YS Jagan : వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా?

YS Jagan

YS Jagan

Former CM and YSRCP chief YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ ​జగన్‌కు బిగ్​షాక్​ తగిలింది. జగన్‌కు సంబంధించిన రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేస్తున్నట్లు సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు తీసుకున్నారు. జగన్​ ఎంపీగా ఉన్నప్పుడు పలు కంపెనీలకు లాభాలు కలిగించగా, వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్​, బెంగుళూరులో ఉన్న ల్యాండ్స్ కొన్ని కంపెనీల్లో వాటాలు అటాచ్ ​చేసినట్లు సమాచారం. ఆస్తులు వైఎస్ జగన్​ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీలు, సహచరుల పేరిట ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది.

 

దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్..
కాగా, గురువారం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిర్ణయం కీలక తీసుకుంది. రూ.793 కోట్లు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమి కేటాయింపులో దాల్మియా సిమెంట్స్‌పై అభియోగం ఉంది. దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల కేటాయింపులపై అభియోగాలు కూడా ఉన్నాయి. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ విచారణ జరిపించింది. వైఎస్ జగన్ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు హవాలా రూపంలో నగదు పొందినట్లు అభియోగం ఉంది. జగన్‌తో కలిసి అక్రమంగా సున్నపురాయి గనులు లీజు పొందినట్లు 2013లో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో వైఎస్ జగన్ సుమారు రూ.150 కోట్ల అక్రమ లబ్ధిని పొందినట్లు సీబీఐ అభియోగం మోపింది. 14 ఏళ్లుగా మనీలాండరింగ్ ​కేసు విచారణ సాగుతోంది.

 

Exit mobile version
Skip to toolbar