Site icon Prime9

ఆంధ్రప్రదేశ్ : డెత్ డే కి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి.. ఈ మరణదిన వేడుకలు ఎందుకంటే?

ex minister paleti ramarao celebrating death day

ex minister paleti ramarao celebrating death day

ఆంధ్రప్రదేశ్ : ఏపీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక్కోసారి కొందరు ఎందుకు ఇలా చేస్తుంటారు అని కొన్ని ఘటనలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మనం చర్చించుకోబోయే విషయం కూడా ఆ కోవలోకే వస్తుంది. పైగా ఈ ఘటన లో ఉన్నది సామాన్యులు అయితే అందరూ ఒక విధంగా స్పందించేవారు. కానీ ఈ విషయం ఇంత రాద్దాంతం కావడానికి ప్రధాన కారణం… ఈ వింత ఆలోచనకి శ్రీకారం చుట్టింది ఒక మాజీ మంత్రి కాబట్టి. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు… తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులను పంపించారు. ప్రస్తుతం ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

రాజకీయ ప్రస్థానం… 

పాలేటి రామారావు చీరాల మాజీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఈయన రెండు సార్లు గెలుపొందారు. మొదట 1994లో కొణిజేటి రోశయ్యపై గెలుపొందటంతో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 2004 లో తిరిగి రోశయ్యపై పోటీ చేసినప్పటికీ… ఓడిపోయారు. ఇక ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరి… 2019 ఎన్నికలకు ముందు టీడీపీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ మళ్లీ కొద్ది కాలానికే వైసీపీ గూటికి చేరుకున్నారు. కాగా ఇప్పుడు అనూహ్యంగా ఈ ఘటనతో అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇన్నాళ్లూ చేసుకున్న పుట్టిన రోజుకు అర్ధం లేదని, మరణ దినోత్సవ వేడుకలు చేసుకోవాలని అనుకుంటున్నానని… నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నాను… అందువల్ల ఈరోజు నుంచే 12వ మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. కావున మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఆ ఆహ్వాన పత్రికలో ఏం రాశారంటే…

” భగవంతుడు ఎంత బోధించినా మానవుడు తన జీవన గమనాన్ని ఆలోచనా విధానాన్ని పూర్తిగా సరి చేసుకొనలేక పోతున్నాడని మాజీ మంత్రి పాలేటి రామారావు అభిప్రాయం.. పరులకు అపకారం జరిగే పనులను ఆపుకోలేక పోతున్నామని, దేవుళ్ళందరూ మానవుడు తప్పక మరణిస్తాడని, జీవించి ఉన్న కాలంలో పరులకు అపకారం చేయకుండా, ఉపకారం మాత్రమే చేయమని నేర్పించారని చెబుతున్నారు.. మానవుడు ఒక జీవి దశ నుండి మనిషి దశలోకి మారాలన్నది భగవంతుల ఆశ్చ జీవిగా ఉన్నంత కాలం తను బతికితే చాలనుకుంటాడు. మానవుడు తనెంత కాలం జీవించాలనుకుంటున్నాడో తనే ఆలోచించుకొని, తన మరణ సంఘటనకు ఒక తారీఖును నిర్ణయించుకోగలగాలని కోరుతున్నారు.. తాను ఖచ్చితంగా మరణిస్తానని గ్రహించి ఇంత కాలం జీవించాం కాబట్టి, ఇంకెంత కాలం జీవిస్తామో లెక్క వేయాలని సూచించారు. కొద్ది కాలమే జీవిస్తానని తెలుసుకున్న తరువాత భగవంతుడు నేర్పించిన విధంగా జీవి దశ నుండి మనిషి దశ లోనికి మారే ప్రయత్నం చేయాలన్నారు.. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తొలి ప్రయత్నంగా. తాను ఎంత కాలం జీవించాలనుకుంటున్నానో ఆలోచించి, మరణానికి ఒక తారీఖును.. అది 2034గా నిర్ణయించానని పాలేటి రామారావు ఆహ్వాన లేఖలో తెలిపారు.

1959లో పుట్టిన తాను ఇప్పటికి ఎంతకాలం జీవించానో తెలిసి, ఇంకెంత కాలం మిగిలివున్నదో లెక్కించానని పాలేటి రామారావు తెలిపారు. తాను ఇంకా 12 ఏళ్లు జీవించాలని భావిస్తున్నందున ఈరోజు 12వ మరణదినాన్ని జరుపుకుంటున్నానని, అభిమానులు వచ్చి ఆశీర్వదించాలని కోరారు. తాను 75 సంవత్సరములు జీవిస్తానని కోరుకుంటున్నాని, ప్రస్తుతం 63 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా 12 సంవత్సరాలు జీవించాలి కావున ఈరోజు 12వ మరణ దినాన్ని జరుపుకోవాలని ఏర్పాట్లు చేసినట్టు పాలేటి రామారావు తెలిపారు. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని పాలేటి రామారావు అభిమానులను కోరారు. ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

 

Exit mobile version
Skip to toolbar