Prime9

New Creature in Seshachalam Forest: శేషాచలంలో అరుదైన కొత్త జీవి.. ‘డెక్కన్‌ గ్రాసైల్‌ స్కింక్‌’గా నామకరణం

New Creature in Found in Seshachalam Reserve Forest: తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని జీవావరణంలో అరుదైన కొత్త జీవిని కనుగొన్నట్లు జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ ధ్రితి బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జాతి స్కింక్‌ (నలికిరి)ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. అరుదైన జీవికి డెక్కన్‌ గ్రాసైల్‌ స్కింక్‌గా పేరు పెట్టారు.

 

పాక్షిక పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలి ఉంటుంది. కొత్త జాతి ప్రస్తుతం ఏపీలోని శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో మాత్రమే కనిపిస్తోందని తెలిపారు. జీవవైవిధ్యానికి ప్రతీకగా పరిశోధన నిలుస్తుందని పేర్కొన్నారు. పరిశోధనకు జడ్‌ఎస్‌ఐ చెందిన హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతాలోని రెప్టిలియా విభాగం, లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషిచేశారని జడ్‌ఎస్‌ఐ ప్రతినిధి డాక్టర్‌ దీపా జైస్వాల్‌ తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar