Site icon Prime9

CM Ys Jagan : సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లను ప్రారంభించిన సీఎం జగన్..

CM Ys Jagan started jagananna colony at samarlakota

CM Ys Jagan started jagananna colony at samarlakota

CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించారు. ఈ మేరకు స్థానికంగా నూతనంగా నిర్మించిన జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామని.. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత సామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు.

రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.  ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని,  రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల  ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్‌లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని,  పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నామని.. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్‌, సిమెంట్‌ అందిస్తున్నామని.. వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నామన్నారు. పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని సీఎం (CM Ys Jagan) జగన్ ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదని.. ఈ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారన్నారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు.

 

 

 

Exit mobile version