Site icon Prime9

CM Jagan: నెల్లూరులో సీఎం పర్యటన.. హెచ్చరిస్తున్న వామపక్షాలు

cm-jagan-tour to nellore dist

cm-jagan-tour to nellore dist

CM Jagan:  సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. జెన్‌కో ను ప్రైవేటుపరం చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని వారు ఆరోపిస్తున్నారు. కాగా జగన్‌ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. జెన్ కో ఎండీ శ్రీధర్ దగ్గరుండి మరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జెన్‌కో ప్రైవేటీకరణ అంశంపై ఆయన స్పందించారు. థర్మల్‌ కేంద్రాన్ని, దాని ఆస్తులను ఎవరికీ అప్పగించడం లేదని శ్రీధర్ స్పష్టం చేశారు. జెన్‌కో నిర్వహణ కంటే తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయగలిగే అవకాశం కోసం ప్రైవేటు టెండర్లు పిలిచామని శ్రీధర్ వెల్లడించారు. కేవలం విద్యుత్‌ ఉత్పత్తి నిర్వహణను మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నట్లు తెలిపారు. కాగా 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

ఇదీ చదవండి: పవన్ పట్ల పోలీసుల తీరు కిరాతకం.. సోము వీర్రాజు

Exit mobile version