Site icon Prime9

CM Jagan: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Prakasam district: సీఎం వైఎస్‌ జగన్‌ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరి 10.35 గంటలకు చీమకుర్తి చేరుకుంటారు. 10:55కు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనం అవుతారు. 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Exit mobile version