Tirupati: సీఎం జగన్మోహన్ రెడ్డిని పేదల పక్షపాతిగా టిటిడి బోర్డు మెంబరు కిలివేటి సంజీవయ్య అభివర్ణించారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా పేర్కొన్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా పేదల కోసం శ్రమిస్తున్న చక్రవర్తిగా జగన్ ను ఆకాశానికి ఎత్తేసారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ చేయూత పధకం లబ్దిదారులతో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
కుప్పంలో సీఎం జగన్ బటన్ నొక్కి రూ. 4949.44 వేల కోట్ల రూపాయలను వైఎస్ఆర్ చేయూత పధకానికి మూడవ పర్యాయం శ్రీకారం చుట్టారన్నారు. దీంతో రాష్ట్రంలోని 26,39,703 మంది లబ్దిదారులైన ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 18,750 లెక్కన చెక్కులు సిద్ధమైందన్నారు. ఈ సాయంతో చిరు వ్యాపారులకు, ఇతర ఉపాధి అవసరాలకు ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే కిలివేటి పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చేయూత పధకం ద్వారా రూ. 14,110.62 కోట్లు పేదలకు అందించామన్నారు. అనంతరం లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో రవికుమార్, మునిసిపల్ కమీషనర్ నరేంద్ర కుమార్, పురపాలక సంఘ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హిందూ, ముస్లింల మద్య గొడవలే భాజాపా లక్ష్యం