Prime9

Annadata Sukhibhav Scheme Starts: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 20 నుంచి అన్నదాత సుఖీభవ అమలు!

AP Govt starts Annadata Sukhibhav Scheme form June 20th by Chandrababu: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 20న అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

 

రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలి..

అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. రైతులు పథకం కింద ఆర్థిక సాయం పొందటానికి ఈ-కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ అర్హులు ఈ-కేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలను ఆటో అప్డేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందన్నారు. అన్నదాతల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. పేర్లు ఉన్న రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. ఈ నెల 20లోగా ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.

 

ఇలా తెలుసుకోండి..

రైతులు తాము ఈ-కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై మొబైల్‌లో అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/‌లోకి వెళ్తే తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. వెబ్‌సైట్‌లో సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టేటస్ బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.

 

Exit mobile version
Skip to toolbar