Site icon Prime9

Chandrababu : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలి.. సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu : క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. చాగల్లులో జరిగే క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు మంగళవారం బుల్లోట్ వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఘటన జరిగింది. స్థానికులు రాజమండ్రి దివాన్ చెరువు-కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ మృతదేహాన్ని నిన్న గుర్తించారు.

 

 

సీఎం చంద్రబాబు విచారం..
పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. మరోవైపు పాస్టర్‌ మృతిపై వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌కు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశించారు.

 

 

లోకేష్ దిగ్భ్రాంతి..
పాస్టర్ ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని, వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

 

 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని, ఘటనలో పాస్టర్‌ మృతిచెందినట్లు రాజానగరం సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్యగౌడ్‌ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాజమండ్రి వస్తుండగా, అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. రహదారి పైనుంచి దిగువకు ప్రమాదవశాత్తు జారిపోయారని, వాహనం అతనిపై పడిపోవడంతో బలమైన గాయాలు కావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరూ గమనించలేదని చెప్పారు. ప్రవీణ్‌కుమార్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని క్రైస్తవ సంఘాల నేతలు రాజమండ్రి జీజీహెచ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

Exit mobile version
Skip to toolbar